ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైపే దేశం మొత్తం చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్నీ శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు తనతో చెప్పారని ఆయన అన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని ఎయిర్‌పోర్టులనూ అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తానన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సోమవారం శ్రీకాకుళం జిల్లాకు ఆయన తొలిసారి వచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. "కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ పిలిపించి కీలకమైన విమానయాన శాఖను నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పారు. భోగాపురం ఇంటర్నెషనల్ విమానాశ్రయం నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. చంద్రుబాబు అరెస్టైన సమయంలో ఆయన ఫ్యామిలీ పడిన బాధ కళ్లారా చూశాను. దేవుడు ఆయనకు న్యాయం చేయడానికే అఖండ విజయాన్ని ఇచ్చాడు" అని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్!
టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్!
మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: