ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
"న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి" అని జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఇవి కూడా చదవండి:
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్!
టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్!
మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: