టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు పేరు ఖరారు అయ్యింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు నియామకం జరిగింది. అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస్ ను నియమించడం జరిగింది. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపారు. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికైన పల్లా శ్రీనివాస్‍కు ఆ స్థానం కేటాయించారు. 95,235 ఓట్లతో టీడీపీ నుంచి గాజువాక ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.
ఈ అంశానికి సంబందించి ఒక మీడియా ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బీసీ వర్గానికి చెందిన నన్ను ఇటీవల వరకు పార్టీ అధ్యక్షలుగా నియమించి పార్టీ బలోపేతం కోసం పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరేసేలా పార్టీ శ్రేణులు పడ్డ అహర్నిశల్లో నేను కూడా పాలు పంచుకున్నాను. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరుతున్నాను. నా జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటాను. నా తుది రక్తపు బిందువు వరకు తెలుగుదేశం పార్టీకే నా జీవితం అంకితం. నిరంకుశత్వ, అరాచక, రౌడీ రాజకీయాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి, పార్టీ నేతలకు నా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా మనమంతా ముందుకుసాగి మరిన్ని విజయాలు సాధిద్దాం...రాష్ట్రాభివృద్ధి కోసం పని చేద్దాం. నాపై నమ్మకంతో కోట్లమంది రైతులకు సేవ చేసేందుకు అప్పగించిన వ్యవసాయ శాఖను విజయవంతంగా నిర్వహించి దేశంలోనే మంచి పేరు తీసుకొస్తానని తెలియజేస్తున్నా.
ఇవి కూడా చదవండి:
మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం! మంత్రి నారాయణ!
పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!
కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల!
వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: