ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం సచివాలయానికి రానున్నారు. సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేయనున్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రభుత్వం అలంకరించింది.
ఇంకా చదవండి: వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!
ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో బుధవారం సాయంత్రం సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. మంత్రులతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత అని సూచించారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రుల సమావేశం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం. రాత్రికి తిరుమలలో కుటుంబంతో కలిసి బస చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ దుర్గగుడికి చేరుకోనున్నారు. దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.
ఇంకా చదవండి: నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!
నారా చంద్ర బాబు అనే నేను! ఆ మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
TG TET-2024 ఫలితాలు విడుదల! అర్హత సాధించిన వారికి ఉచిత DSC దరఖాస్తు!
AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: