మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 24 మందిలో ఆరుగురికి మాత్రమే గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. సాయంత్రానికి శాఖల కేటాయింపు పూర్తి చేసే అవకాశం ఉంది. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమల శాఖలను సీనియర్లకు కేటాయించే ఛాన్స్ ఉందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జోరుగా జరుగుతుంది. నారా లోకేశ్ కు మరోసారి ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ ఇస్తారని చర్చ నడుస్తుంది. ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావులకు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పట్టణాభివృద్ధి శాఖను సీఎం వద్ద లేదా నారాయణకు కేటాయిస్తారని వారతలు వినిపిస్తున్నాయి. గతంలో పట్టాణాభివృద్ధి శాఖలో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు చూసిన నారాయణ. మైనార్టీ సంక్షేమ శాఖను ఫరూక్ కు కేటాయించే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యారాణికి ఇచ్చే ఛాన్స్ ఉంది. సాంఘిక సంక్షేమ శాఖను డోలా బాలవీరాంజనేయస్వామి లేదా అనితకు ఇస్తారని చర్చ నడుస్తుంది. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఈ సారి కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ముగిసిన చంద్రబాబు ప్రమాణస్వీకారం! ఆయనతో పాటు వీరు కూడా!
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా అభిమానులు! వాహనాలతో నిండిపోయిన రహదారులు!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు!
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: