రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ జరగాలన్నారు. పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఏసీఎస్ నుంచి కూడా పంట రుణం తీసుకున్న రైతుల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశించారు. పంద్రాగస్ట్ నాటికి రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు!
అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు!
మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: