టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో ఓసారి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ హత్యాయత్నానికి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ను విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అంతేకాదు, కస్టడీలో తనకు గాయాలైతే, ఆ గాయాలపై గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి న్యాయస్థానానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని రఘురామ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకు కొంతకాలానికి వైసీపీ నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. ఓ దశలో ఆయన సొంత నియోజకవర్గంలో ఉండలేక ఢిల్లీ వెళ్లిపోయారు. ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ... టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి:
మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు!
అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు!
ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత!
మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని!
సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా!
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: