బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇంకా చదవండి: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫైర్! చేసిన ఘనకార్యాలు అన్నీ మీడియా ముందు!
2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి, విజయవాడ ఎంపీగా గెలిచిన నాని, మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్నిపై నాని ఓడిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!
ట్విట్టర్ (ఎక్స్)లో ఆయన పోస్టును పరిశీలిస్తే, “జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను మరియు నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి, వారి తిరుగులేని మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రాజకీయాలకు దూరమవుతున్నా, విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కొత్త అధ్యాయానికి వెళుతున్నప్పుడు, ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను మరియు అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు. హృదయపూర్వక కృతజ్ఞతతో.. మీ కేశినేని నాని” అంటూ ట్వీట్ చేశారు బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని.
ఇంకా చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కీలక మలుపు! వైసీపీ నేతల అరెస్టు! నిందితులను కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం! జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!
మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!
బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు! ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్ష!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులపై సర్కారు సర్‌ప్రైజ్! ఉపాధ్యాయుల కోరికపై సెలవులు మరింత పొడిగింపు!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: