కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో టీడీపీకి రెండు కీలక మంత్రి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడు మరియు పెమ్మసాని చంద్రశేఖర్‌లు కేంద్ర మంత్రులుగా ఎంపికయ్యారు. రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించనున్నట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి.
ఇంకా చదవండి: సోనియా, రాహుల్ గాంధీలకు కీలక పాత్రలు! కాంగ్రెస్ కీలక సమావేశంలో కొత్త బాధ్యతలు ఏంటో తెలుసుకోండి!
తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే ప్రభుత్వం ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాలను రెట్టింపు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ద్వారా మంచి ఫలితాలు సాధించింది. ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం విడివిడిగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు కేటాయించారు.
ఇంకా చదవండి: చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!
ఇక వీరికి ఏ శాఖలు లభిస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే శాఖలను ఆశిస్తున్నామని రామ్మోహన్ నాయుడు ఇటీవల పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను టీడీపీ కోరుకుంటున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: ప్రమాణస్వీకారానికి అన్ని సిద్ధం! డ్రోన్లు వాడకంపై నిషేధం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నీట్ పరీక్ష ఫలితాల్లో అనుమానాస్పద ఘటనలు! వెంటనే దర్యాప్తు చేపట్టాలన్న ప్రియాంక!
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!
తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!
తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: