ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలను నమోదు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
ఇంకా చదవండి: అయ్యో.. బొత్స ఎంతపని చేశావు!! జగన్ కు కూడా తెలీదా? గవర్నమెంట్ ఎంప్లాయిస్ తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా!
వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వైసీపీ ఓటమిపై తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ అహంకారమే కారణమని తేల్చి చెప్పారు. జగన్ అహంకారం వల్లే ఈ రోజున ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో ఘన విజయం సాధించిన కూటమి నేతలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: