ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం : ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. రాత్రింబవళ్ల కష్టానికి ఫలితమే ఈ విజయం- ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారు. రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ధన్యవాదాలు. గత పదేళ్లుగా సుపరిపాలన అంటే చూపించాం. దక్షిణ భారత ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తక్కువ కాలంలోనే ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీని ప్రజలు ఆదరించారు. తమిళనాడులో సీట్లు గెలువకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ బీజేపీని ప్రజలు ఆదరించారు. అరుణాచల్, సిక్కిం, ఏపీలో క్లీన్‍స్వీప్ చేశాం.
ఇంకా చదవండి: అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?
నాపై విశ్వాసం ఉంచి ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ నేతలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ఎన్డీఏ కూటమి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది . ఎస్టీ జనాభా ఎక్కువున్న 10 రాష్ట్రాల్లో 7 చోట్ల కూటమి అధికారంలో ఉంది. మన కూటమి అసలైన భారత్ స్ఫూర్తిని చాటుతుంది. మన కూటమి భారత్ ఆత్మగా నిలుస్తుంది. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరం - ఎన్డీయే కూటమి 30 ఏళ్లుగా నడుస్తోంది. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం. ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ప్రధాని మోదీ. న్యూ ఇండియా.. డెవలప్ ఇండియా.. యాస్సిరేషనల్ ఇండియా. ఇదే స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అందరి కర్తవ్యం : ప్రధాని మోదీ
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల కోడ్ ముగింపు! కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం! మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే భేటీ!
చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!
చంద్రబాబు కార్యాలయంలో మార్పులు! రవిచంద్ర కీలక పాత్రకు ఎంపిక!
ఎగ్జిట్ పోల్స్ తర్వాత సిట్ కార్యాలయంలో ఆందోళన! ఫైళ్లు గల్లంతు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: