ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పవన్‌ను పిఠాపురంలో ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానని సంచలన సవాల్ చేశారు. ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అయితే, పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో అప్రతిహత విజయం సాధించింది.

ఇంకా చదవండి: ఏపీలో చంద్రబాబు సునామి - మోడీ! ఇకపై రోజుకు 18 గంటలు పని చేస్తా! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్!

ఈ పరిస్థితుల్లో, ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, "నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పత్రాలు సిద్ధం చేశాను. సవాలలో నేను ఓడిపోయాను కాబట్టి, నా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను," అన్నారు.

ఇంకా చదవండి: ప్రజల నమ్మకాన్ని చాటిన కూటమి! కీలక బాధ్యతలు అప్పగించిన ప్రజలు! కూటమి విజయం పై మోదీ అభినందనలు!

అయితే, ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్ జగన్‌ను గౌరవించకపోవడం బాధాకరం అని ఆయన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్‌తోనే కొనసాగుతుందని, జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత, ముద్రగడను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కొందరు నెటిజన్లు ముద్రగడ పేరుమార్పు కార్యక్రమం అంటూ ఓ కార్డును కూడా తయారు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇంకా చదవండి: రాష్ట్రపతి భవన్ సందర్శకులకు నో అనుమతి! జూన్ 5 నుండి 9 వరకు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

కూటమి విజయం అనంతరం! చంద్రబాబు రాకకై పెద్దలు! నేడు NDA నేతలతో! ఢిల్లీలో ఆంధ్ర కు మహర్దశ!

ప్రజలు మాకు పవిత్రమైన బాధ్యత అప్పగించారు! వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు.. లోకేశ్

5 సంవత్సరాలు అధికారంలో ఏం చేశాడో... ఇప్పుడు సమీక్షిస్తాడంట! విజయసాయిరెడ్డి కామెంట్స్!

టీడీపీ ఏజెంట్ రమేష్‍ కు గుండెనొప్పి! 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు!

నరసరావుపేటలో భద్రత పెంపు! ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచెలు, బారికేడ్లు!

వైసీపీకి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ! పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం!

ఈరోజు రాత్రి పది నుండి గుంటూరు విజయవాడ హైవే బంద్! అన్ని రకాల వాహనాలకు అనుమతి లేదు! కౌంటింగ్ స్టాఫ్ కి మాత్రమే!

నేతల భద్రతలో మార్పులు అనే వార్తలు అవాస్తవం! మంగళగిరి డి ఎస్ పి!

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group