అమరావతి : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కాసేపట్లో పోస్టింగ్ ఇవ్వనున్న ప్రభుత్వం. ఫైల్ సిద్దం చేసిన ప్రభుత్వం. నిన్న ఏబీకి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీని సర్వీస్‍లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్ జవహర్‍రెడ్డి. సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం. ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా నియమించనున్న ప్రభుత్వం. హైకోర్ట్ ఉత్తర్వుల మేరకు ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ABV ని సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు, రాజ్యం అనేది అత్యంత బలమైన వ్యవస్థ, ఒక వ్యక్తిగా దానితో పోరాడలేవు, నిజమేదైనా, న్యాయం నీ పక్షానున్నా, లొంగిపోవడం ఉత్తమం అని. ఈ మధ్యన తానా సభలకు వెళ్ళినప్పుడు చాలా మంది NRI లు కూడా అదే ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు, మీరు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కదా, అంత పోరాటం అవసరమా అని. దానికి ABV ఇచ్చిన సమాధానం ఒకటే - ఒక మనిషిగా, ఒక ఉద్యోగిగా నన్ను నేను 30 సంవత్సరాలుగా మలుచుకున్నాను. నా విలువలను నేను ఎంచుకున్నాను. అలాగే నడుచుకున్నాను. ఇవాళ ఒక ఆర్ధిక ఉగ్రవాది, ఒక రాజకీయ నేరస్తుడు, ఒక హంతకుడు వచ్చి నన్ను..... , నన్ను ఒక అవినీతి పరుడినని, ఒక దేశ ద్రోహి అని ముద్ర వేస్తే, నేను తలొంచుకుని వెళ్ళిపోతే, నేను మనిషినవుతానా, నడుస్తున్న శవాన్నవుతానా? అంత హీనమైన బ్రతుకూ ఒక బ్రతుకేనా?
ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే!
సస్పెన్షన్ లో ఉన్నా గానీ, ABV పోలీసు ఉద్యోగం మానలేదు. వివేకా హత్య కేసు CBI కి ఇచ్చాక సంవత్సరం దాటినా ఏమీ పురోగతి లేని దశలో, ABV, CBI డైరెక్టరుకి రాసిన ఉత్తరం బాంబులా పేలింది. తన దగ్గరున్న వివరాలు ఇస్తాను, ఎవరినయినా పంపమని రెండు సార్లు చెప్పినా ఎవరూ రాలేదని, హత్య కేసు ఇంతవరకూ పరిష్కరించలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి బహిరంగంగా అనేసరికి CBI పూర్తి ఆత్మరక్షణలో పడింది. ఫలితంగా ABV వాంగ్మూలం తీసుకోవడం, అటునుంచి అటే పులివెందుల వెళ్లిన CBI టీం రెండు నెలలు ఆపకుండా చేసిన దర్యాప్తు ఫలితమే వివేకా హత్య కేసు బద్దలవడానికి నాంది. ABV ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా సేకరించిన IPDR (ఇంటర్నెట్ వాడకం రికార్డు) ఆధారంగానే అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడెప్పుడు వాట్సాప్ లో మాట్లాడాడో CBI నిర్ధారించగలిగింది.
ఇవి కూడా చదవండి:
ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే!
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే?
2019లో ఎగ్జిట్ పోల్ లో 151 వైసీపీకి అని చెప్పిన KK సంస్థ! ఈసారి NDAదే హవ! వివరాలు అన్ని...
కౌంటింగ్ రోజు కఠిన నిబంధనలు! పోలీసుల మాక్‌డ్రిల్! ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!
సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!
10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: