ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు.. ముఖ్యంగా పిఠాపురం జనసైనికులు, వీరమహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే, వాళ్లలో ఒకరకరమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు.
ఇంకా చదవండి: నీతిగా ఉండే అధికారులకు బెదిరింపులు పెరిగాయి! కౌంటింగ్ ప్రక్రియలో పక్కాగా ఉండాలని!
ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు నా విన్నపం ఏంటంటే.. మనం ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలి. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, పోలీసులకు సంపూర్ణంగా సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్ గానే ఉందాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనమేమీ చేయొద్దు. తద్వారా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకుందాం. రేపు రాబోతున్నది కచ్చితంగా మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి, ఓడిపోయే వాళ్లు పాల్పడే కవ్వింపు చర్యలకు, అల్లర్లకు జనసైనికులు, వీర మహిళలు ప్రతిస్పందించవద్దు అంటూ నాగబాబు విజ్ఞప్తి చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: