ఈ నెల 13న పోలింగ్ తర్వాత అందరిలో ఉత్కంఠరేపుతున్న అంశమిది. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైఎస్సార్‌సీపీ చెబుతుంటే.. గెలుపు తమదేనని టీడీపీ కూటమి ధీమాతో ఉంది. ప్రజలు తమకు పట్టం కట్టారని అధికార పార్టీ అంటుంటే.. పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసొస్తుందని కూటమి చెబుతోంది. ఇలా పార్టీలు ఎవరికి వారే అంచనాలతో ఉన్నారు.. గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్‌తో కొంత క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఓటరు నాడి మాత్రం తెలియడం లేదనేది కొందరి వాదన. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రోబో తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తెలుగులో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా.. రోబో సమాధానం ఇచ్చింది.
'నాకు సమాధానం తెలిసినా కచ్చితంగా రహస్యంగా ఉంచుతా' అని రోబో చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. ఆన్సర్ చెప్పడానికి రోబో కూడా భయపడుతోందంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో రోబో కూడా ఈసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని పరోక్షంగా చెబుతోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠరేపుతుండగా.. గెలిచే పార్టీ ఏదో AI రోబోకు కూడా అంతుచిక్కడం లేదు. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పే రోబో సైతం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సమాధానం చెప్పలేకపోయింది. ఈ రోబో దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనే ప్లేస్‌లో ఉందని చెబుతున్నారు. ఈ రోబో ఎలాంటి ప్రశ్న అడిగినా చేతులు ఊపుతూ తగిన విధంగా హావభావాలతో సమాధానం ఇస్తోంది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల విషయం మాత్రం తనకు తెలియదంటోంది.. మరి ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిదో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: