అమరావతి : ఎన్‌టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్‌టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్‌టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్‌టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఆయన అంటే నవరసాలకు అలంకారం అని అన్నారు. నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు.
ఇంకా చదవండి: ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పని చేస్తాం! ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ మోదీ కితాబు!
సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు అని ప్రశంసించారు. ఎన్‌టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వైద్యులు, న్యాయవాదులు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. ఆయన తీసుకొచ్చిన పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: