ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. ప్రధానంగా వైసీపీ, కూటమి మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే ఆ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికార పీఠం దక్కించుకుంటుందనే సెంటిమెంట్ వినిపిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో ఏ అభ్యర్థులు అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే బలమైన సెంటిమెంట్ ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ అదే జరిగింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో 1978 లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994, 99లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. అధికార పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే ఈ నాలుగు చోట్ల గెలుస్తుందో ఆ పార్టీ అధినేతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని పలువురు అంటున్నారు. ఇప్పవరకూ ఆ నాలుగు చోట్ల గెలిచిన పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలను చూస్తే అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు! పులివర్తి నాని వ్యాఖ్యలు!
వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: