గుంటూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశాం. ఈసీ, జాతీయ మానవ హక్కుల కమిషన్‍కు ఫిర్యాదు చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదేపదే హెచ్చరించారు. పిన్నెల్లి వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల గృహనిర్బంధం నుంచి తప్పించుకుని హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడినా పిన్నెల్లిపై చర్యలు లేవు.. పిన్నెల్లిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై మాచర్లలో దాడులు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను పిన్నెల్లి కబ్జా చేశారు.
ఇంకా చదవండి: వైసీపీలో కీలక సంఘటన! పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్! కారణం అదేనా
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు దాడులు చేశాయి. వైసీపీ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు గాయపడ్డారు. దాడిచేసి.. పోలీసు అధికారులకు కులం అంటగట్టి మాట్లాడతారా?. అధికారుల జాబితా పంపింది, నియమించింది మీ ప్రభుత్వమే కదా?. నా ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి గృహనిర్బంధం చేశారు. చట్టాన్ని గౌరవించి నేను ఇంట్లోనే ఉండిపోయా.. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో నువ్వెళ్లి దాడిచేసింది నిజం కాదా?. గొడవకు టీడీపీ అనుకూల అధికారులు కారణమని ఎలా అంటారు?. ఇంత దాడి చేసినా హత్యాయత్నం కేసు కాకుండా 324 సెక్షన్ కేసు పెట్టారు. ఐజీ త్రిపాఠిని ఈసీ నియమిస్తే దానికి కూడా టీడీపీ కారణమంటారా? అని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: