ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1వరకు యూకే వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి కోరారు జగన్. సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు బెయిల్ షరతు సడలించాలని సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లండన్‌లో తన కుమార్తెలు చదువుకుంటున్నారని.. వారితో కొన్ని రోజులు గడపడం కోసం కూడా అక్కడికి వెళుతున్నట్లు జగన్ చెప్పారు. కాగా జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆస్తుల కేసులో విచారణ జరుగుతోందని, ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇప్పటికే ఓసారి ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మే 14వ తేదీకి వాయిదా వేసింది. జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
తిరుపతి: చంద్రగిరిలో ఉద్రిక్తత! భయపడుతున్న ప్రజలు
కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్‌కి, ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండటంతో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు ప్లాన్ చేశారు జగన్.
ఇవి కూడా చదవండి:
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి