పోలింగ్ ఏజెంట్ లుగా కూర్చుంటున్న వారికి ముఖ్య విజ్ఞప్తి. ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా చూసుకోండి.
1. Poling స్టార్ట్ అవ్వడానికి గంట ముందుగానే బూత్ కి చేరుకోవాలి. పార్టీ తరుపున మీకు ఇచ్చిన లెటర్ పోలింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి.
2. మాక్ పోలింగ్ జాగ్రత్తగా చూసుకోండి. ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వేశారో నోట్ చేసుకొని కౌంటింగ్ లో కరెక్టుగా వచ్చాయో లేదో చూసుకొండి.
3. మాక్ పోలింగ్ అయ్యాక క్లియర్ బటన్ నొక్కారా లేదా చూడండి. ఓట్లు క్లియర్ చేసాక సీల్ వెయ్యాలి. అప్పుడు క్లియర్, కౌంట్ బటన్ లు పని చెయ్యకుండా మొదటి సీల్ వేస్తారు. వివి పాట్ లను కూడా జాగ్రత్తగా చూడండి.
4. EVMల దగ్గరికి పోలింగ్ సిబ్బంది గాని, ఏజెంట్లు గాని ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు.
5. ఓట్ వెయ్యలేని వాళ్లు సహాయకులను వాళ్ళే తెచ్చుకోవాలి. అంతే తప్ప పోలింగ్ సిబ్బంది సాయం చేయకూడదు.
6. మీ దగ్గర కూడా లిస్టులు ఉంటాయి. పోలయిన ఓట్లు టిక్ పెట్టుకోవాలి. మధ్య, మధ్యలో ఎన్ని ఓట్లు పోలయినాయో చెబుతారు. లెక్క కరెక్టుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. పోలింగ్ అంతా అయిపోయాక క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సీల్ చేస్తారు. క్లోజ్ బటన్ నొక్కారో లేదో జాగ్రత్తగా చూడండి. లాస్ట్ కి వేసే సీల్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నోట్ చేసుకోవాలి. ఆ సీల్ మీద పోలింగ్ ఆఫీసర్ తో పాటు ఏజెంట్స్ కూడా సంతకాలు చెయ్యాలి.
8. EVMల బాటరీ ఆఫ్ చేశారో లేదో చెక్ చేసుకోండి.
9. తరువాత EVMలను క్లాత్ కవర్ లో పెట్టి లక్కతో సీల్ వేస్తారు. ఆ సీల్ మీద ఏజెంట్ స్పెషల్ గా ఏదన్నా గుర్తుతో సీల్ వెయ్యచ్చు. రేపు కౌంటింగ్ అప్పుడు మళ్ళీ ఇవి అన్ని గుర్తించాల్సి ఉంటుంది.
10. మీ దగ్గర ఉన్న లిస్టుల ద్వారా దొంగ ఓటర్ లను జాగ్రత్తగా గుర్తించండి.
11. వీలయినంత వరకు పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోకుండా EVMలను పోలింగ్ సెంటర్లో అప్పగించేంత వరకు జాగ్రత్తగా చూడండి.
12. లాస్ట్ లో వేసే సీల్ నంబర్, ఏజెంట్ సంతకాలు, ఏజెంట్ వేసే లక్క సీల్ ఇవి చాలా ముఖ్యం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అల్లు అర్జున్, వైసీపీ శిల్పా రవిచంద్రారెడ్డిపై కేసు నమోదు! ఇవాళ నంద్యాల వచ్చిన అల్లు అర్జున్!.
బీర్లు తాగుతూ రూ.26 లక్షలు సంపాదించిన వృద్ధుడు! అబ్బా ఇదేదో బాగుందే ఎలాగో తెలుసుకోండి!
మందు గ్లాసుతో యాంకర్ రష్మి హల్ చల్! దానికి కారణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
మేము ఐదుగురం అన్నదమ్ములం.. నేను ఇంకా సెటిల్ కాలేదు! ఇంటర్వ్యూలో ముక్కు అవినాశ్ మాట్లాడుతూ..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి