ఇటీవల విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మతుకుమిల్లి శ్రీ భరత్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన అందరికీ బాలయ్య చిన్నల్లుడు గాను, గీతం విద్యాసంస్థల ఓనర్ గాను తెలుసు. పూర్తి వివరాలలోకి వెళ్తే గీతం యూనివర్సిటీ స్థాపించి ఇప్పటికీ నాలుగు దశాబ్దాలు అవుతుంది. విభిన్నమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పరిశోధన సంస్థగా ఎంతో పేరు పొందింది. ఉన్నత విద్యలో బెంచ్ మార్కును సెట్ చేయాలని ఉద్దేశంతో గీతం ఎప్పటికప్పుడు తన ప్రోగ్రామ్లను అప్డేట్ చేస్తూ ఉంటుంది.
శ్రీ భరత్ తాతగారు అయిన MBBS మూర్తి 1980లో గీతం విద్యాసంస్థలను స్థాపించారు. ఎంతో కృషి చేసి ఈ విద్యా సంస్థలను అభివృద్ధి చేశారు. రెండుసార్లు టిడిపి తరఫున విశాఖపట్నం ఎంపీగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు. గోల్డ్ స్పాట్ మూర్తిగా ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఆయన మరణించారు.
గీతం డీమ్డ్ యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు లో కూడా ఉంది. ప్రస్తుతం గీతం నాలుగు క్యాంపస్ లు, 21 స్కూల్స్, 25,000 మంది విద్యార్థులను కలిగి ఉంది. శ్రీ భరత్ 2019 ఎన్నికలలో విశాఖపట్నం నియోజకవర్గం నుండి టిడిపి తరఫున పోటీ చేసి కొద్దిలో ఓడిపోయారు. అయినా కూడా ప్రజల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. భరత్ పర్డ్యూ యూనివర్సిటీ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA/MA ఎడ్యుకేషన్ డిగ్రీ ని కూడా పొందారు. చదువు పూర్తయిన తర్వాత కుటుంబానికి చెందిన విద్యుత్తు రంగ పరిశ్రమల్లో కొంతకాలం పనిచేశారు, ఒరిస్సా లోని జల విద్యుత్, ఆంధ్రలోని సౌర విద్యుత్ పరిశ్రమల్లో పనిచేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక భరత్ ఆస్తులు విషయానికి వస్తే అతని పేరు మీద 16.89 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి, భార్య తేజస్విని పేరు మీద 48.36 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. భరత్ పేరు మీద 183.95 కోట్ల రూపాయల స్థిరాస్తులు, భార్య పేరు మీద 46.43 కోట్ల రూపాయల స్థిరాస్తులు. మొత్తం కలిపి ఇద్దరి పేరు మీద 295.63 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరి పేర్ల మీద మొత్తం 1.88 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.
నాలుగు దశాబ్దాల కాలంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గా రూపుదిద్దుకోవటంలో పట్టుదల, దీక్ష, అంకితభావం కలిగినటువంటి పాత్ర వహించినటువంటి శ్రీ భరత్ లాంటి యువకులు విద్యావంతులు మన చట్టసభలలోకి వెళ్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటివారిని మనం తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం. రాబోయే ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటు మెంబర్ గా తప్పకుండా దేశ రాజధానిలో కూర్చోపెడదాం. పార్లమెంటుకే వన్నె తీసుకొద్దాం. దానికి తగ్గట్టుగా విశాఖపట్నం వాసులందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని శ్రీ భరత్ కు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం జెండాను ఢిల్లీలో కూడా రెపరెపలాడిద్దాం.
ఇవి కూడా చదవండి:
ఏపీ: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని పర్యటన షెడ్యూల్! వేమగిరిలో ఏర్పాటు
సుప్రీం తీర్పునకు ఈసీ, పార్టీలు కట్టుబడి ఉండాలన్న హైకోర్టు! అభ్యర్థుల నేర చరిత్ర పత్రికల్లో
నా రికార్డ్లు నేనే బద్దలు కొడతా! నా పిలుపుతో 35 వేల ఎకరాలు! గుంటూరు ప్రజాగళం లో చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి