గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విధంగా ప్రసంగించారు. ప్రజల్లో ఉత్సాహం చూశాక సైకో పార్టీకి డిపాజిట్ రావని అర్థమైంది. నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనేది నా సంకల్పం. అమరావతిలో 185 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం... దుర్మార్గుడు అధికారంలోకి వచ్చి నా కలలను విధ్వంసం చేశాడు. నా పిలుపుతో అమరావతి రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు... అమరావతిలో 2019లో భూమి విలువ ఎంత.. ఇప్పుడెంత? జగన్ వచ్చాక అమరావతిలో భూముల ధరలు పెరిగాయా?.. తగ్గాయా?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి రాజధానిలో గుంటూరు ఒక భాగం... ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న నేత మనుగడ సాధించలేడు. సైకో డబ్బులు ఇచ్చాడని ఓట్లేస్తే ఇంక అంతే సంగతులు. మా హయాంలో ఏ ముస్లిం వ్యక్తికైనా అన్యాయం జరిగిందా? విశాఖలో రాజధాని వద్దని ప్రజలు చెబుతున్నా జగన్ వినడు... ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తా... హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం వ్యక్తికి రూ.లక్ష ఇస్తా... మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ. 5 లక్షలు వడ్డీలేని రుణం ఇస్తాం... ఇమామ్ లను ప్రభుత్వ ఖాజీలుగా ఇస్తాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నూర్ బాషాలకు కార్పొరేషన్ పెట్టి ఏటా రూ.100 కోట్ల ఆర్థిక సాయం చేస్తా... ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగేలా పోరాడుతాం. జగన్ అహంకారి, విధ్వంసకారి, దోపిడీదారుడు... నాసిరకం మద్యం తాగి మనం బలిపశువులం కావాలా? కొత్త చట్టం తెచ్చి.. జగన్ పట్టా ఇస్తారంట... ప్రజల ఆస్తి హక్కు పత్రంపై జగన్ ఫొటో వేసుకుంటాడు. ప్రజల భూమిపై జగన్ పెత్తనమేంటి? జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపై నా రెండో సంతకం పెడతా అని చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి