మహిళలకు రైతులకు కూటమి మేనిఫెస్టోలో పెద్దపీట వేసారు. ఇప్పటికే సూపర్ సిక్స్ ద్వారా తల్లికి వందనం పేరుతో స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 సం॥ నుంచి 59సం ॥ వరకు), ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన టీడీపీ నేడు కూటమి మేనిఫెస్టో ద్వారా మరిన్ని సదుపాయాలను ప్రకటించింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మహిళల కోసం:
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంపు
ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు
అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన
విద్యార్థినులకు 'కలలకు రెక్కలు' పథకం ద్వారా రుణాలు పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్దరిస్తాం అని ప్రకటించింది.
పాడి రైతులు కోసం:
పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు - ఇన్సూరెన్స్ సౌకర్యం - గోకులాల ఏర్పాటు మేత కోసం బంజరు భూముల కేటాయింపు
గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
ఇంకా చదవండి: కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు తగిన గౌరవం! సిపిఎస్ టు జిపిఎస్! కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు!
వ్యవసాయం కోసం:
9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా
రాయితీతో సోలార్ పంప్ సెట్లు మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందించుట - పంటల బీమా వర్తింపు
రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు / సంక్షేమ పథకాల అమలు
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం (ZBNF) చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు
ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్ల ఆధునీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు
దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీయంసీ యాక్ట్ పటిష్టంగా అమలు
డ్రిప్ ఇరిగేషను 90% సబ్సిడీ
రాష్ట్రంలో సెరికల్చర్ను ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: