రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తునకొద్దీ టీడీపీ వర్గీయులపై విరుచుకుపడుతున్నారు. తన అనుచరులతో కలసి ఇలా మీద దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా బలవంతంగా వైసీపీ కండువాను వేయిస్తున్నారు. అర్ధరాత్రి ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో మరింత అరాచకానికి పాల్పడ్డారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ బీసీ నాయకుడు బోయ లింగమయ్య ఇంటిదగ్గరకు రాజారెడ్డి అనుచరులు వెళ్లారు. అన్న పిలుస్తున్నాడు.. రా.. అని పిలిచారు. ఆ ఇంటివద్ద హల్‌చల్ చేశారు. తాను రానని లింగమయ్య స్పష్టం చేయడంతో విషయం రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన రాజారెడ్డి.. లింగమయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. ‘ఉంటే వైసీపీలో ఉండాలి.. లేదంటే ఊరు విడిచిపెట్టి వెళ్లాలి. పార్టీలో చేరకపోతే నరికిపారేస్తాం..’ అని బెదిరించాడు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వారి ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. కొడకల్లారా.. టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! ఉంటే వైసీపీలో ఉండండి. లేదంటే ఊరు విడిచి వెళ్లండి అని హెచ్చరించారు. పరిటాల వాళ్లు ఇక్కడికి ఎలా వస్తారు..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ అరాచకాన్ని ఓ వ్యక్తి చిత్రీకరిస్తుండగా, అతనిపై దాడి చేసి సెల్‌ఫోన లాగేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బ్రహ్మం చౌదరి! పరామర్శించిన పలువురు నేతలు!
బాబాయి కోసం వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం! పిఠాపురంలో! ఘనస్వాగతం పలికిన జనసైనికులు!
ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది! లోక్ సభకు 686, అసెంబ్లీకు 3,644! ఎల్లుండి అధికారిక ప్రకటన!
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి