గుడివాడలో రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి కొడాలి నాని మరియు టిడిపి నుండి వెనిగండ్ల రాము బరిలో తలపడనున్నారు. వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అమెరికాలో అట్లాంటా నగరంలో సెటిల్ అయిన ఎన్నారై, అక్కడ వందలకోట్లు సంపాదించారు. పారిశ్రామికవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. అతని భార్య దళిత క్రిస్టియన్, రాము ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెనిగండ్ల రాము మామగారు గుడివాడలో ప్రముఖ పాస్టర్లలో ఒకరు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని చర్చలు కూడా నడుస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో 10 లక్షలు ఖర్చుపెట్టి రెండు మంచినీటి RO ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎంతోకాలం నుండి ప్రజలకు ఉపయోగపడే సేవలు చేస్తున్నారు. అమెరికాలోని తన కంపెనీ లో కూడా తెలుగు వారు ఎంతోమందికి ఎన్నో వందల ఉద్యోగాలు ఇచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక వెనిగండ్ల రాము ఆస్తుల విషయానికి వస్తే ఆయన పేరు మీద 136.24 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 72.43 కోట్ల రూపాయలు చరాస్తులు ఉన్నాయి. వీరిద్దరి పేరు మీద కలిపి 208.68 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. రాము పేరు మీద 64.74 కోట్ల రూపాయలు స్థిరాస్తులు ఉన్నాయి, ఆయన భార్య పేరు మీద 10.93 కోట్ల రూపాయలు స్థిరాస్తులు. మొత్తం వీరిద్దరి పేరు మీద 75.68 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. ఇరువురికి కలిపి మొత్తం ఆస్తులు 284.36 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే వీరిద్దరి పేరు మీద మొత్తం 16.61 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.
జగన్ సర్కార్ కు మరో షాక్! సీఈసీ కీలక ఆదేశాలు! వారి బదులుగా ప్రభుత్వ ఉద్యోగులు
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గుడివాడ అంటేనే బూతులు గుర్తుకువచ్చే పరిస్థితికి తెచ్చారు. అసెంబ్లీ లో కూడా బూతులు మాట్లాడిన చరిత్ర ఉన్న కొడాలి నానీ ని ఈ ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలి అంటే వెనిగండ్ల రాము వంటి మంచి విలువలు ఉన్న వ్యక్తిని ఓటు వేసి గెలిపించుకోవాలి. గుడివాడలో అభివృద్ధి జరగాలి అన్నా, ప్రజాపాలన రావాలి అన్నా మన ఓటు వెనిగండ్ల రాము కే వేయాలి. ఇలాంటి వ్యక్తి మన నాయకుడు అయితే, మన నియోజకవర్గానికి, రాష్ట్రానికి గర్వకారణం. చంద్రబాబు కన్న కలలు సాకారం అవ్వాలి అంటే ఇలాంటి నాయకులు గెలవడం ఎంతో అవసరం. కాబట్టి మన ఓటు వెనిగండ్ల రాము కు వేసి ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించుకుందాం.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి