రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 503 నామినేషన్లకు ఆమోదం, 183 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గుంటూరు లోక్ సభ స్థానానికి 47 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి 16 నామినేషన్లు దాఖలు అవ్వడం జరిగింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,644 నామినేషన్లు దాఖలు చేశారు. 2,705 నామినేషన్లకు ఆమోదం, 939 నామినేషన్లు తిరస్కరణ లభించింది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి 52 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చోడవరం అసెంబ్లీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎల్లుండి, అనగా ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు ఇవ్వడం జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి! చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి