తిరువూరులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా.. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు. ఐదేళ్లయింది.. ప్రత్యేక హోదా ఊసే లేదు. మన బిడ్డల భవిష్యత్తుపై జగన్ ఆలోచించట్లేదు.
ఇంకా చదవండి: పిచ్చిమందుతో పేదల జీవితాల్ని జగన్ బలిపీఠం.. రూ.3.14 లక్షల కోట్ల ప్రజా కష్టార్జితాన్ని..ప్రత్తిపాటి పుల్లారావు
మూడు రాజధానులన్నారు.. ఒక్కటి కూడా లేదు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలి. జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది? ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ. 3 వేల కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైంది? అని వైఎస్ షర్మిల జగన్ ప్రశ్నించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: