విజయనగరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తూ ఎక్కడా చూడని జనసంద్రం విజయనగరంలో చూస్తున్నా జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ మీటింగ్ లు వెలవెల.. మన మీటింగ్ లు కళకళ అని కామెంట్ చేసారు. జగన్ శవ రాజకీయాలతో వస్తున్నారు. ప్రజలు వైసీపీకి శవయాత్ర కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.. వైసీపీకి డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయి... రాష్ట్రంలో కూటమిదే అధికారం, రూపాయి తలపై పెడితే పైసాకు కూడా జగన్ ను కొనరు అని ఎద్దేవా చేసారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనం కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారు... 45 ఏళ్లుగా ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని చూడలేదు. అశోక్ గజపతిరాజును ఎలా వేధించారో చూశారా? నేను తలుచుకుంటే జగన్ జైలు నుంచి బయటకు వచ్చేవారా? అని ప్రశ్నించారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే మేము కలిశాం. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జగన్ ఎంత ఖర్చు పెట్టారు? అని అడిగారు. ఉత్తరాంధ్ర యువత ఉత్సాహం చూస్తే సంతోషంగా ఉంది... కూటమి గెలుపునకు పని చేయాలని యువతను కోరుతున్నా... యువత భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తున్నా... బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం.. నిత్యవసర ధరలు తగ్గిస్తాం... ఏం చేయబోతున్నామో రేపో.. ఎల్లుండో చెప్తాం... అవసరమైతే మ్యానిఫెస్టోలో మరికొన్ని చేరుస్తాం అని తెలిపారు ... ఇది క్లాస్ వార్ కాదు క్వాష్ వార్ అంటూ వైసీపీ నేతలు దోచుకున్నది మొత్తం కక్కిస్తాం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: గత వారం జరిగిన దాడులపై తనిఖీలు! అరెస్ట్ అయిన 12 మంది! ఎక్కువగా యువకులే!
ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్న NRI TDP ఐర్లాండ్ సభ్యులు! చీపురుపల్లి లో స్వాగతించిన కళ వెంకట రావు!
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి