లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణాలో రాజకీయం హీటెక్కింది. అధికార, ప్రతి పక్షాల మధ్య సవాళ్ల యుద్ధం(రాజకీయం) నడుస్తుంది. తామిచ్చిన హామీలు నెరవేరిస్తే బీఆర్ఎస్(BRS) పార్టీ మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావ్ కు సవాల్ విసిరారు. ఆ ప్రశ్నకు ధీటుగా ఇలా సమాధానం ఇచ్చారు హరీష్ రావ్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి రాజకీయం చేస్తున్నారు... ఆయన ఇచ్చిన సవాల్ నేను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు తేల్చి చెప్పారు. మళ్ళీ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని.. తనకు పదవులు ముఖ్యం కాదని హరీష్ రావు అన్నారు. రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని ప్రశ్నించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ విషయాలపై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తా. కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన 8 ప్రధాన హామీలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. 2024 ఆగస్టు 14 అర్థరాత్రి వరకు మీకు గడువు అని హరీశ్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి