నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మేకపాటి కుటుంబీకులకు వరుసగా ఘోర అవమానాలు జరుగుతున్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో స్థానికుల నిరసనలు తెలియచేసారు. అంతేకాకుండా సమస్యలు తీర్చకుండా మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి, పోలిరెడ్డిపల్లిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ప్రజలు నిలదీసారు. దీనితో అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వింజమూరు మండలం గుండెమడుగులో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అక్కడ ఉపసర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి నిలదీశారు. కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన రూ.8 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారంటూ ఉపసర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు ఉపసర్పంచ్ సహా అతని అనుచరులను అడ్డుకున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇదిలా ఉండగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా అల్లంపాడు ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని, ఆత్మకూరు మున్సిపల్ చైర్‍పర్సన్ వెంకటరమణమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మర్రిపాడు పీఎస్‍లో వివిధ సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేసారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి