ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు. ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని.. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరియు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా పై బదిలీ వేటు పడింది. ఆయనకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.. అధికారపార్టీతో వీరు ఇరువురు స్వామి భక్తి ప్రదర్శిస్తూ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారు అనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు విజయవాడలో సీఎంపై రాయి దాడి ఘటనలో దర్యాప్తుపై టీడీపీ సీరియస్ అవుతూ ఇంటిలిజెన్స్ చీఫ్‍పై కూడా పెత్తఎత్తున ఆరోపణలు చేసింది. దీనితో వీరి స్థానంలో ముగ్గురి పేర్లతో ప్యానెల్ పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా జిల్లాలో పలువురు పోలీసులు అధికారులు పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వారి ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. వైసీపీ మూకలు చేసే అరాచకాలను చూసీచూడనట్లు పోతున్నారు. రాజకీయ పరమైన దాడులకు సంబంధిత ఎస్పీలు, సీపీలే బాధ్యత వహించాలని ఈసీ స్పష్టంగా చెప్పినా కాంతి రాణా తీరు మారలేదు. ప్రశ్నించే వారిపై వైసీపీ నేతలు కర్రలు, రాళ్లు, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో సీపీ విఫలమయ్యారు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా: మూతపడ్డ ప్రముఖ నివాస భవనాల సంస్థ! అవార్డు గెలుచుకున్న భవనం! అసలు కథ ఏమిటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ చదువు, ఆస్తుల వివరాలు!! ఆస్తిలో సగం పైగా అప్పే
రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు
అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సెక్యూరిటీ!! సీఆర్డీఏ ప్రత్యేక బృందం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి