ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది... ఈ ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. అయితే తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారు.. ఆ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, కేసుల వివరాలను ప్రస్తావించాల్సి ఉంటుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక సమర్పించిన ఆస్తుల వివరాలపై ఆసక్తికరంగా చర్చలు సాగాయి... తాజాగా సీఎం జగన్ బుట్టా రేణుకను పరిచయం చేసే క్రమంలో ఆమె బీసీ కులానికి చెందిన చెల్లెమ్మ.. ఆర్థికంగా కూడా అంతంతమాత్రమే అన్నారు.
వైసీపీ నేతలకు పెద్ద షాక్!! భర్త పై పోటీకి సిద్దమైన భార్య!! నామినేషన్ తేదీ కూడా ఖరార్
అఫిడవిట్‌లో సమర్పించిన ఈ పేద చెల్లెమ్మ వివరాలు ఇవే... రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ మొత్తం రూ.161.21 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.142.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు. అప్పులు రూ.7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు రూ.242.60 కోట్లు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇంతేకాదు ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తున్నాయి. కర్నూలులో ఒక కేసు ఉంది.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి