ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీలకు రెబల్ అభ్యర్థుల తిప్పలు మొదలయ్యాయి... తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్థికి ఇంటిలోనే పోటీ మొదలయ్యింది. ఎవరో కాదు ఆయన సొంత భార్యే ఆయనపై పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఆసక్తికర పరిణామం టెక్కలి నియోజకవర్గంలో జరిగింది..
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల దగ్గర ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మరోవైపు ఇవాళ ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దంపతుల మధ్య విభేదాల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు అని సమాచారం.
ఇవి కూడా చదవండి:
గుంటూరు: టీడీపీ ప్రచార రథంపై రాళ్ల దాడి!! రాళ్ల దాడితో ధ్వంసం!! పీఎస్‌లో ఫిర్యాదు
చంద్రబాబు: నవమి అనగానే నాకు ఒంటిమిట్ట ఆలయం గుర్తుకొస్తుంది!! వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి