ఇటీవల కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో గాయపడిన వారిని జనసేన మరియు టీడీపీ నాయకులు అదాన్ హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది. అయితే ఎక్కువ మంది కేరళ కి చెందిన వారు ఉన్నారు, మరి కొందరు నార్త్ ఇండియా కు చెందిన వారు ఉన్నారు. కేరళ కు చెందిన వారిలో ఒకరు నాలుగవ అంతస్తు నుండి కిందకు దూకడం వలన రెండు కాళ్ళకు, ఫ్రాక్చర్ అయ్యింది అతనికి సర్జరీ చేయాలని డాక్టర్ లు తెలిపారు. అలాగే కొందరు బిల్డింగ్ కి ఉన్న కేబుల్ వైర్ లు ఆధారంగా కిందకు దిగేందుకు ప్రయత్నించారు, వారికి ఫ్రాక్చర్స్ అయ్యాయి.