కువైట్ సిటీ, మే 19: జూన్ నుండి ఆగస్టు వరకు బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని చేయరాదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పిఎఎమ్) ప్రకటించింది. వేసవిలో ఎండ తీవ్రత నుండి కార్మికులను రక్షించడం మరియు కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లకు అంతరాయాలు కలిగించకుండా పనిని నియంత్రించడం ఈ నిర్ణయం లక్ష్యం అని వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లు మూడు నెలలు దీనిని పర్యవేక్షిస్తాయి అని, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని PAM హెచ్చరించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉల్లంఘనలను గుర్తించడానికి మరియు వ్యాపార యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ బృందాలు పని ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే వ్యాపారాలపై ప్రైవేట్ సెక్టార్ లేబర్ చట్టంలో వివరించిన విధంగా జరిమానాలు విధించబడతాయి. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి కార్మికుడికి జరిమానాలు KD100 నుండి KD200 వరకు ఉంటాయి మరియు దానిని సరిదిద్దే వరకు కంపెనీ ఫైల్ బ్లాక్ చేయబడే అవకాశం ఉంది అని వెల్లడించారు. దేశంలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం సవాలుగా ఉన్న కారణంగా, ఈ నిర్ణయం అమలు చేయడానికి వివిధ రంగాలలోని కంపెనీలు ఆమోదించాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా, వ్యాపార యజమానులు తమ కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత పట్ల తమ నిబద్ధత కలిగి ఉంటారు అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!
బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి!
ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు! వీడియో వైరల్! దీని రేట్ ఎంతో తెలుసా!
అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మహిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె!
బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి!
'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు'! కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు! హేమ వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి