కువైట్ సిటీ, ఏప్రిల్ 16: “ఈజిప్షయన్లకు కువైట్ ఎంట్రీ వీసా” అనే పేరుమీద వీడియో క్లిప్‌లో కనిపించిన ఈజిప్టు ప్రవాసిని బహిష్కరించారు. ఈ వీడియోలో, “కువైట్‌లో పని చేయాలనుకునే ఎవరికైనా వర్క్ వీసా ధర 400,000 నుండి 500,000 ఈజిప్షియన్ పౌండ్‌లు ఉంటుంది. కంపెనీలో పనిచేసే వారి విషయానికొస్తే, ఇది ఉచితం" అని తప్పుడు సమాచారం పెట్టారు. చట్టాలను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేసి బహిష్కరణ విభాగానికి అప్పగించారు. అంతకుముందు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసినందుకు ఈజిప్షియన్ ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని తప్పుడు సమాచారం మరియు డేటా గా ఉన్నందున అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి