కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 16న అబ్దాలీ ప్రాంతంలో కాన్సులర్ క్యాంపును నిర్వహించనుంది. సలాహ్ ఫలాహ్ ఫహద్ ఆజ్మీ ఫామ్ (సుబియా రోడ్, బ్లాక్ 06, చిన్న జామియా దగ్గర, అబ్దాలి)లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు కాన్సులర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. క్యాంపు సమయంలో అన్ని ధృవీకరించబడిన పత్రాలు అక్కడికక్కడే పంపిణీ చేయబడతాయి అని, అబ్దాలీ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ పౌరులు రాయబార కార్యాలయానికి రాకుండా ఈ సేవలను పొందేందుకు ఈ క్యాంపు చాలా ఉపయోగ పడుతుంది అని, క్యాంప్ సైట్ లో నగదు చెల్లింపులు మాత్రమే ఆమోదించబడతాయని ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కావున ఎంబసీ సేవలు అవసరం అయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి