అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2014-19 మధ్య సచివాలయ ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాలు, ఏఐఎస్లు, ఎన్జీవోల సముదాయాలను నిర్మించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అమరావతిలో ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టత ఏ విధంగా ఉందనే విషయంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సచివాలయ ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాలు, ఏఐఎస్ లు, ఎన్జీవోల సముదాయాల బేస్ మెంట్స్ పై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధ్యతలను చెన్నై ఐఐటీకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
జగన్ కు షాక్! ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ ఇద్దరు డీజీపీ ఆఫీస్‌కి రిపోర్టు చేయాలని ఆదేశాలు!
ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!
పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: