ఖతార్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆపార్టీ నాయకులూ, శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై, పార్టీకి ప్రజలు కట్టబెట్టిన ఘనవిజయానికి కృతజ్ఞతలు తెలియజేసారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈసందర్భంగా విజయం సాధించిన పార్టీ అభ్యర్థులకు పేరుపేరునా అభినందనలు తెలియచేసారు. ప్రజలు గడిచిన 5 ఏళ్లగా నరకం చూసారని.. రాక్షసపాలన నుంచి విముక్తి లభించిందని చెప్పుకొచ్చారు.
ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు!
.202406061013.jpg)