దోహా: దోహా నుంచి డబ్లిన్ వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానంలో భారీ కుదుపులు వచ్చాయి. 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. టర్కీ మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా విమానంలో టర్బులెన్స్ కి గురైంది. ఆరుగురు ప్రయాణికులు, మరో ఆరుగురు విమాన సిబ్బంది గాయపడ్డారని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ధృవీకరించాయి. దోహా నుంచి ఖతార్ ఎయిర్‌వేస్ విమానం QR017 ఆదివారం 13.00 గంటల ముందు డబ్లిన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొన్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ల్యాండింగ్ తర్వాత, ఎయిర్ పోర్టు పోలీస్ రెస్క్యూ సిబ్బంది గాయపడిన 12 మందికి అత్యవసర సేవల్ని అందించింది. టర్కీ మీదుగా వెళుతున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురైందని డబ్లిన్ ఎయిర్ పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కాగా, ఇటీవలే 211 మంది ప్రయాణికులతో లండన్ నుంచి సింగపూర్ ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన టర్బులెన్స్ కి గురైన విషయం తెలిసిందే. బ్యాంకాక్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో చెలరేగిన అల్లకల్లోలంతో 73 ఏళ్ల బ్రిటన్ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. విమానంలోని చాలా మంది తలలకు, వెన్నెముక, మెదడు భాగాలకు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పరిశోధకులు కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నారని సింగపూర్ రవాణా శాఖ మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: