రిజర్వేషన్ల విధానం వల్ల బంగ్లాదేశ్ అట్టడుకుతోంది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారి 105 మంది చనిపోయారు, దాదాపు 2500 మంది గాయపడ్డారు. దేశం అంతా కర్ఫ్యూ విధించారు. కాగా.. అక్కడున్న భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 450 మంది భారతీయులు సరిహద్దులు దాటి మేఘాలయకు చేరుకున్నారు. భారతీయులే కాక నేపాల్ (Nepal), భూటాన్ (Bhutan) దేశాలకు చెందిన 600 మంది విద్యార్థులు ఆశ్రయం కోసం మేఘాలయ చేరుకున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ అధికారులు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 245 మంది భారతీయు సరిహద్దులు దాటినట్లు మేఘాలయ హోంశాఖ తెలిపింది. వారితో పాటు 13 మంది నేపాలీలు కూడా ఉన్నారని వెల్లడించింది. ఇక, శనివారం తెల్లవారుజాముల మరో 363 మంది మేఘాలయాకు వచ్చినట్లు పేర్కొంది. వీరిలో 204 మంది భారతీయులు, 158 మంది నేపాలీ విద్యార్థులు, ఒక భూటాన్ వ్యక్తి ఉన్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన భారతీయుల్లో ఎక్కువమంది వైద్య విద్యార్థులే ఉన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్, హర్యానా, మేఘాలయ, జమ్ముకశ్మీర్కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. కాగా.. బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసపై విదేశాంగ శాఖ స్పందించింది. 8 వేల మంది విద్యార్థులు సహా 15వేల మంది బంగ్లాదేశ్ లో ఉన్నట్లు పేర్కొంది. వారికి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేసింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!
చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!
అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: