ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని పరిశీలించిన తర్వాత సంతృప్త స్థాయిలో ఉంటే హాల్టింగ్ ను పొడిగిస్తారు. లేదంటే కేవలం ఆరు నెలలకు లేదంటే ఏడాది కాలం వరకు పరిమితం చేస్తారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ లోపు దశలవారీగా హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ క్రింద పేర్కొన్న స్టేషన్లలో ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను నిలుపుతారు. అలాగే ఆదాయంతోపాటు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటే వీటిని అలాగే కొనసాగించడానికి అవకాశం ఉంది. దీనికి ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో రికమండేషన్ చేయించాల్సి ఉంటుంది. ఏయే స్టేషన్లలో ఏ రైళ్లు ఆగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇంకా చదవండి: శ్రీశైలంలో చిరుత కలకలం! రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో..
ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్‌లో పూరి-తిరుపతి (17479) తిరుపతి-కాకినాడ టౌన్ (17249) బిలాస్‌పూర్-తిరుపతి (17481) రైళ్లు ఆగుతాయి.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి స్టేషన్లలో భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లు ఆగుతాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో..
లింగంపల్లి- నర్సాపూర్ (17256)
చెంగల్పట్టు-కాకినాడ (17643)
ప్రకాశం జిల్లా గిద్దలూరు స్టేషన్‌లో.. ధర్మవరం-రేపల్లె (17216) ఆగుతుంది.
సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో నాగర్‌సోల్-నర్సాపూర్ (17232) రైలు ఆగుతుంది.
భీమడోలు స్టేషన్ లో గుంటూరు-రాయగడ (17243)
పుట్లచెరువు స్టేషన్ లో గుంటూరు-నరసాపూర్ (17281)
గూడూరు జంక్షన్‌లో కాత్రా-కన్యాకుమారి (16318)
పసివేదల స్టేషన్‌లో విజయవాడ-కాకినాడ పోర్టు (17257)
ఉప్పులూరు స్టేషన్ లో విజయవాడ-మచిలీపట్నం ( 07866)
మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో ధర్మవరం-మచిలీపట్నం (17216)
న్యూ గుంటూరు స్టేషన్‌లో చెంగల్పట్టు-కాకినాడ (17643)
కంభం స్టేషన్‌లో యశ్వంత్‌పూర్-మచిలీపట్నం (17212)
ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!
చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!
అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?
రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం! ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు!
రైతులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! వారికి మూడేళ్లు సబ్సిడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: