కేరళను బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి కలవర పెడుతోంది. కోజికోడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధితో కోజికోడ్ కు చెందిన 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. చెరువులో స్నానానికి దిగిన తర్వాత అతడికి ఈ వ్యాధి సోకింది. కోజికోడ్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో పీపీఎంతో ఐదేళ్ల బాలిక చికిత్స పొందుతోంది. దీంతో, కేరళలో పీపీఎంకి సంబంధించిన నాలుగో కేసు నమోదైంది. కోజికోడ్ లో గత రెండు నెలల్లోనే అరుదైన ఇన్ఫెక్షన్ తో మొత్తం ముగ్గురు చనిపోయారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా, పీఏఎం వ్యాధి నివారణ కోసం కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు ఎవరూ వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని సూచించారు. చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్ క్లిప్లను వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చన్నారు. అంటువ్యాధులను నివారించడానికి నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం సమష్టి బాధ్యత అని అధికారులకు సూచించారు.
ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
పీపీఎం అనే వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా బాడీలోకి చేరుతుంది. నాలుగు రోజుల్లోనే మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలోనే దాని వల్ల మెదడులో వాపు వస్తుంది. ఫలితంగా బాధితుడు చనిపోతాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారు. ఇకపోతే, మే 21న పీఏఎం కారణంగా కేరళలో తొలి మరణం నమోదైంది. మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక పీఏఎంతో చనిపోయింది. ఆ తర్వాత జూన్ 12న కన్నూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ఆ వ్యాధితో మరణించింది. ఇప్పుడు 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు.
ఇవి కూడా చదవండి:
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!
వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: