సమాజంలో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. అది ఎంత తీవ్రంగా మారిందంటే.. భార్యను కాపురానికి పంపలేదనే కోపంతో ఓ వ్యక్తి తన అత్తింటిపై దాడి చేశాడు. ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. రాత్రివేళ పెట్రోల్ తీసుకుని వచ్చిన నిందితుడు.. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అయితే అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఇంటి ముందు భాగం కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని ఈడేపల్లికి చెందిన గండికోట శ్యాంప్రసాద్ రెడ్డి తమ కుమార్తెను పెడనకు చెందిన దాసరి శబరీనాథ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే అంతలోనే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. శబరీనాథ్ చెడు వ్యసనాలకు బానిస కావటంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారటంతో.. శ్యాంప్రసాద్ రెడ్డి కూతురు అత్తగారిల్లు వదిలేసి వచ్చింది.
ఇంకా చదవండి: ఏడాదికి కోటి పెళ్లిళ్లు! రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్‌లో అట్లుంటది మరి!
గత కొంతకాలంగా పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యను కాపురానికి పంపాలంటూ మామ శ్యాంప్రసాద్ రెడ్డిని.. అల్లుడు శబరీనాథ్ గత కొంతకాలంగా కోరుతున్నారు. అయితే శ్యాంప్రసాద్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దీంతో ఆదివారం రాత్రి శబరినాథ్.. ఈడేపల్లిలోని శ్యాంప్రసాద్ రెడ్డి ఇంటివద్దకు చేరుకున్నాడు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మూడు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంటి ముందు భాగం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఆ తర్వాత పక్కనే ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి బంధువుల ఇంటి వద్దకు వెళ్లిన శబరీనాథ్ అక్కడ నిలిపి ఉన్న మరో రెండు వాహనాలను తగలబెట్టాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన అల్లుడిపై మామ శ్యాంప్రసాద్ రెడ్డి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె పుట్టింటికి వచ్చిందని.. అయితే కాపురానికి పంపలేదనే కోపంతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు ఫిర్యాదు చేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!
టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్ బంద్! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?
తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: