ఏపీలోని విజయవాడ పరిధిలోని బృందావన్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమిస్తున్న యువతి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. తన కూతురును ప్రేమిస్తున్నట్లు తెలియడంతో యువకుడిని ఆమె తండ్రి మందలించాడు. దీంతో సదరు యువకుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి కూతురు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శివమణికంఠ ఓ స్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్నాడు. యువతితో మణికంఠకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల యువతి తండ్రి రామచంద్ర ప్రసాద్‌కు ఈ ప్రేమ విషయం తెలిసింది. దాంతో యువకుడిని మందలించాడు. ఇక తండ్రికి ప్రేమ విషయం తెలియడంతో యువతి మణికంఠను దూరం పెట్టింది. అతడు చేసిన పెళ్లి ప్రతిపానను కూడా తిరస్కరించింది. ఇదే విషయమై యువకుడి ఇంట్లో గొడవ జరగడంతో అతని తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ యువతి తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా రామచంద్ర ప్రసాద్‌ను మట్టుబెట్టాలనుకున్నాడు. స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్న రామచంద్ర ప్రసాద్ కూతురితో కలిసి రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
ఇంకా చదవండి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం! ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో! 13 మంది దుర్మరణం!
అయితే, అప్పటికే షాపునకు దగ్గరలో కాపుకాసిన మణికంఠ తండ్రీకూతుర్లు వెళ్తున్న బైక్‌ను తన వాహనంతో ఢీకొట్టాడు. వారు కిందపడిపోగా యువతి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయడపడిన రామచంద్ర ప్రసాద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం కృష్ణలంక పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి నిందితుడు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: