ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటూ మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ మూడు రోజులు మద్యం అమ్మకాలు ఉండవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.. అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హరీష్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని.. రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు.
ఇంకా చదవండి: హైదరాబాద్ మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్తగా 27 రకాల బీర్లు! ఆ రెండు బీర్లు టేస్ట్ సూపర్!
అంతేకాదు సోషల్ మీడియాలో జరిగే ప్రచారం, వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కిస్తారు. ఈ కారణంగానే మద్యం షాపుల్ని మూసివేస్తున్నారు. ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ముందు రోజు నుంచి.. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. అంతేకాదు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని.. బాణసంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే తెలిపారు. కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జూన్ 15 వరకు నిఘా కొనసాగించాలని కేంద్ర ఇంటిలిజెన్స్ అలర్ట్‌తో ఎన్నికల సంఘం, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: