అమ్మవారి గుడిలో ఇలా కూడా దొంగతనం చేయొచ్చా అంటే చెయ్యొచ్చు అని ఒక్క యువకుడు నిరూపించాడు. ఏమి తెలివి రా నాయనా... అసలు స్టోరీ ఏమిటంటే.. కాకినాడలోని సంజయ్ నగర్‌లో అమ్మవారి ఆలయం రోడ్డుకు ఆనుకుని ఉంది. ప్రతి రోజూ భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో అమ్మవారి హుండీని ఎవరో ఎత్తుకెళ్లారు.. ఆలయ నిర్వాహకులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే చోరీ వ్యవహారం బయటపడింది. ఈ నెల 20న ఓ వ్యక్తి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చాడు. బయట చక్కగా చెప్పులు వదిలేసి... గుడిలోపలికి వెళ్లి అమ్మవారికి మొక్కాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి మెట్లపై కూర్చున్నాడు. మళ్లీ లోపలికి వచ్చాడు.. మళ్లీ బయటకు వెళ్లి కూర్చున్నాడు. రెండు, మూడుసార్లు అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి నేరుగా ఆలయంలోకి వెళ్లాడు.
రోడ్డుపై వచ్చీపోయే వారిని బాగా గమనించాడు. రోడ్డు మీద పెద్దగా ఎవ్వరూ లేని సమయంలో గుడిలోపలికి వెళ్లి హుండీని ఒక గోనెసంచిలో మూటకట్టాడు. హుండీని భుజంపై పెట్టుకుని దర్జాగా బయటకు వచ్చాడు. ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.. ఇంత జరిగినా చుట్టూ ఎవరూ పట్టించుకోలేదు. దొంగ ఆలయంలోకి రావడం.. బయట కూర్చోవడం.. ఆ వెంటనే హుండీని ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌లో ఉన్న తేదీని బట్టి ఈ నెల 20న చోరీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో జరిగింది. అర్చకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: