అకస్మాత్తుగా తన అకౌంట్లో సుమారు రూ.9,900 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి దిమ్మెరపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. భాను ప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ ఎన్‌పీఏగా (నిరర్థక ఆస్తి) మారింది. ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా రూ. 99,99,94,95,999.99 దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ‘‘సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అకౌంట్‌లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశ్‌కు మేము వివరించాము.
ఇంకా చదవండి: టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం! మరో 13 మందికి తీవ్ర గాయాలు..!
పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాము. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాము’’ అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. ‘‘ఎన్‌పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్‌పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్‌లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము’’ అని ఆయన తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: