సైబర్ నేరగాళ్లు మరీ బరితెగించిపోతున్నారు. ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరించిన మోసగాడు.. రాత్రంతా ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఏకంగా రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆపై మోసపోయానని భావించిన బాధితురాలు అప్రమత్తం కావడంతో డబ్బులు బదిలీ కాకుండా ఆగిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఈ నెల 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనను తాను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న అతడు.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పడంతో ఆమె వణికిపోయింది. తనను రక్షించాలని కోరింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయాడు. స్కైప్‌లో వీడియోకాల్ చేసిన నిందితుడు రాత్రంతా ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఉదయం బ్యాంకులు తెరిచే వేళ వరకు ఆమెతో మాట్లాడుతూనే ఉన్న నిందితుడు.. ఆమెను బ్యాంకుకు పంపి రూ. 60 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కి ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదుచేశారు.
అప్రమత్తమైన సీఎస్‌బీ బృందం ఆమె లావాదేవీల వివరాలను సిటిజన్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్)లో నమోదు చేయించారు. ఎస్‌బీఐ ఖాతాలకు అప్పటికే నగదు బదిలీ కావడంతో బ్యాంకు ప్రతినిధులను అప్రమత్తం చేసి ఆయా ఖాతాల నుంచి నగదును ఉపసంహరించకుండా లాక్ చేయించారు. ఈ వ్యవహారం మొత్తం గంటలోపే ముగిసింది. పోయిందనుకున్న మొత్తం వెనక్కి రావడంతో బాధితురాలు ఊపిరిపీల్చుకుంది. పోలీసులు ఎవరూ ఇలా వీడియోకాల్ చేసి డబ్బులు అడగరని, అలాంటి కాల్స్ వస్తే 1930కి ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: