మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే క్షుద్రపూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారట. అయితే, పోలీసులు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరినీ ఆదివారం ఆరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు’’ అని ఓ వార్తా వెబ్‌సైట్ పేర్కొంది. గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. అయితే, తాజా పరిణామాలపై ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇవి కూడా చదవండి:
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు!
మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి
కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: